STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

సఖీ నీతో సల్లాపము

సఖీ నీతో సల్లాపము

1 min
5


సఖి నీతో సల్లాపము..ఏ రీతిగ జరుపుదునో..! 

నీ తలపుల చిత్రపటము..ఏ రీతిగ గీయుదునో..! 


తడబడు నా పెదవులింటి..సరిగమలే మూగబోయె.. 

ఎగసిపడే నా హృదయము..ఏ రీతిగ చూపుదునో..!


వ్రాయరాని భాషలేవొ..నీ కనులకె తెలియునేమొ.. 

నీ చూపుల మధుగీతము..ఏ రీతిగ పాడుదునో..! 


మౌనములో గాకుండా..మాటాడుట తెలియదాయె.. 

తాళలేని ఈ విరహము..ఏ రీతిగ తెల్పుదునో..! 


దరిచేరగ పరుగులిడే..ముచ్చటలో మనసుండునె.. 

నా భావనకో శిల్పము..ఏ రీతిగ చెక్కుదునో..!


అల్లుకున్న మధుబాలా..తూచలేను నీ దయనే.. 

ఏ జన్మకు నీదు రుణము..ఏ రీతిగ తీర్చుదునో


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance