సిరుల పండుగ
సిరుల పండుగ
సంకురాతిరి పండగొచ్చెను
సకల జగతికి శుభము తెచ్చెను
మానవాళికి మంచి తెలిపి
మమత నిలిపెడి దినము వచ్చెను
బాధలన్నియు త్రోసిపుచ్చి
పసిడి ఆశలు మోసుకొచ్చెను
దేశమందున క్షామమన్నది
కానరాదని తెలుపు చున్నది.
ప్రజల మదిలో శాంతి నింపగ
వసుధ నిండుగ వెలుగు నింపగ
కలిమి నొసగెడి పర్వదినము
చెలిమి నిలిపెడి పర్వదినము
వచ్చెనిదిగో వచ్చెనిదిగో!
వైభవకాంతులు తెచ్చెనిదిగో!
పాడిపంటలు పల్లె సిరులు
వెల్లి విరియగ భవిత వరలు
'నాది, నాద'ను తృష్ణను పెకిలించగ
'మనది మన 'మను భావన చిగురించగ
చేయి చేయి కలిపి మనము
స్వాగతించగ కలుగు జయము.//
