శశిరూపం
శశిరూపం
తడిసిందా ఆకాశం
జడివానకు కాస్తయినా.....
వణికిందా!! భూగోళం
సంద్రంలో మునిగున్నా..
కదిలిందా హిమ శిఖరం
పెనుగాలులు ఢీకొన్నా....
తరిగిందా శశిరూపం
అమవాస్యలు ఎన్నున్నా..
ఆటంకాలెన్నున్నా
ఆశయాన్ని మరువొద్దు...
అవరోధాలెన్నున్నా
లక్ష్య్ం గురి తప్పొద్దు...
