STORYMIRROR

Jyothi Muvvala

Action Classics Children

4  

Jyothi Muvvala

Action Classics Children

శీర్షిక:నమో నారసింహ!

శీర్షిక:నమో నారసింహ!

1 min
362


మము బ్రోవుమయ నారసింహ 

కరుణ చూపవయ్యా శ్రీ లక్ష్మీ నరసింహ !

నీ నామస్మరణే నొసుగును వైకుంఠం

నీ ధ్యానం తోలగించేను కర్మఫలం!

భక్తిశ్రద్ధలతో కొలిచిన చాలు దొరుకును ముక్తికి మార్గం

నీ కడగంటి చూపుకే ఈ ఆరాటం నమో నరసింహ!


నీ చూపులే ఉదయ సంధ్యలు 

నీ దయార్ధ హృదయమే భూమండలం

అష్టదిక్కులు నీ రథ చక్రాలు

గ్రహ మాలికలే నీ మెడలో హారాలు 

నమో నారసింహ!


పర్మాత్మవై జీవాత్మవై మాలో కొలువైనావు 

సర్వత్ర వ్యాపించినావు నమో నారసింహ! 

సృష్టి స్థితి లయ కారకుడయిన నిన్ను 

 విగ్రారాధనలోనే బంధించాము!

నిజరూప దర్శనం చూడలేనట్టి మూర్ఖులం మేము 

 శరణాగతి నీవే చూపలయ్యా నమో నరసింహ!


మము బ్రోవుమయ నారసింహ 

కరుణ చూపవయ్యా శ్రీ లక్ష్మీ నరసింహ !


- జ్యోతి మువ్వల


Rate this content
Log in

Similar telugu poem from Action