సారథి
సారథి
నా జీవిత పయనంలో గెలుపు బాటలో నాతో నడుస్తుంది నువ్వు
ఆగిన దారిలో గమ్యం గమనం గుర్తు చేస్తుంది నువ్వు
నీతో నడచిన అద్బుత క్షణాలు పధిలం ఎప్పటికి
జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరటానికి దైర్యం కలిగిస్తుంది నువ్వు
కాలం విలువలు బంధం తోడు ఆర్థిక అవసరాలే
కష్ట సుఖాలు భాగం మాత్రమే సత్యం బోధిస్తుంది నువ్వు
మాట మార్చిన మనిషి తీరు మారకపోతే నేమి
కాల గమనంలో పోటీకి తట్టుకో అని హెచ్చరిస్తుంది నువ్వు
ప్రపంచం అంతా అధ్బుతం మన చేతిలో వుంటే
మన ఆలోచనలే మన లోకం అని సూచిస్తుంది నువ్వు
అన్నీ తెలిసినా వేదాంతం ఎక్కడో ఒక చోట ముగింపు
సంతోషమే వారధి జీవితానికి సారథి నమ్మకం అని చెప్పింది నువ్వు

