STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

సాధుగుణము

సాధుగుణము

1 min
259


తేనె లొల్కెడి మధుర భాషణము

మంచితనము నిండిన మానసము

పరుల మేలును గోరు వర్తనము

ధర్మమార్గము నందు పయనము

సాధులక్షణ మనగా విజయా!


శాంతి ప్రబోధనమే ప్రతిక్షణము

క్రాంతి దర్శనము చూపు వీక్షణము

వినయ విధేయతతో మెల్గటము

విబుధ జనులతో సాంగత్యము

సాధులక్షణ మనగా విజయా!


ధీరగుణశీలులై నిరతము

సారమతులై చూపి సహనము

కరుణాకరులై చరించటము

కష్టనష్టముల నెదుర్కొనటము

సాధులక్షణమనగా విజయా!


దేశభవితకై పాటుపడటము

భావితరమును తీర్చి దిద్దటము

స్ఫూర్తిప్రదాతలై నిల్చి యుండటము

కీర్తివంతులై వెల్గుచుండటము

సాధులక్షణ మనగా విజయా!


వారి దీవెనలు పొందియుండటము

వారి శిష్యులుగా జీవించటము 

వారిమార్గాన ప్రయాణించటము

వారి బోధనలు ప్రవచించటము

మనము నేర్చుకోవాలి విజయా!//

------


Rate this content
Log in

Similar telugu poem from Classics