రవి కిరణం
రవి కిరణం
ఉదయించు రవి కిరణమే పుడమికే పంచే ఆత్మీయత
తొలి వెలుగులో నిండిన ప్రకృతి రమణీయత
శుక పిక రవముల మంత్రముతో దినకరునికే జోత
పరచిన పొగమంచు తెరలే తొలగునులే తొలుత
పసిడి వర్ణాల కాంతులతో భువి మెరిసిపోవునంతా
పద్మినీ హృదయమే పొంగి వికసించు కొలను కాంత
వరిచేను తలలూపుతూ రాసేను మేటి భవిత
నింగిలో మబ్బుల దోబూచులాడే చిరుగాలి రాసే కవిత
ఆహ్లాద పరిమళ సుమ వీచికల స్పర్శయే తొలిపొద్దుల చరిత
అనుభవైక నైవేద్యమే అనుభూతి చెందిన మది ఘనత..
