STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

రథచక్రాలు

రథచక్రాలు

1 min
6

రథచక్రాలు 


(వచనకవిత )


వస్తాయా జగన్నాథ రథచక్రాలు?

చూస్తామా భవ్యమౌ భానోదయాలు?


ఆకలి కేకలార్తనాదాలతో 

చీకటిలో ఛిద్రమౌ ఆశలతో 

నిలువెత్తున మన భారతం 

కలతలో మున్గి విలపిస్తోంది 


బలవంతులదైన రాజ్యంలో 

పలు గాయాల దెబ్బలతో 

పేదరికమింకా వెక్కి ఏడుస్తోంది 

బదులివ్వడానికి భయపడుతోంది 


మతోన్మాదుల విష వలయంలో 

మతిపోయే మారణహోమంలో 

సమన్యాయం చచ్చిపోయింది 

మమతన్నది మాయమయింది.


జగన్నాథ రథచక్రాలొస్తాయని 

జగతికి శుభమే జరుగుతుందని 

చీకటిలో పరిగెడుతూ నీ జనులు 

వేకువకై పడిగాపులు పడుతున్నారు.


అదిగదిగో రథఘోష వినిపించిందా?

కదిలొచ్చిన దైవత్వం కనిపించిందా?//



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics