STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

రంగవల్లి

రంగవల్లి

1 min
1

మందారపు నవ్వింతయు..అలుగకుండ చూడు..!

సన్నజాజి మనసు కాస్త..వాడకుండ చూడు..!


తనకన్నా తోడు నిలచు..నేస్తమెవరు ఇంక..!

గున్నమావి అందాలను..త్రెంచకుండ చూడు..!


సుగంధాల వనమంటే..తన తలపుల వాడ..!

పారిజాత పనుపేమొ..నలగకుండ చూడు..!


చినుకుచినుకు సోయగాల..పసిడిమేఘ మేదొ..?!

చేమంతుల సింగారం..చిందకుండ చూడు..!


ఏ గగనపు కోవెలలో..ఏమున్నదొ ఏమొ..

ఎదుటనున్న కలువబాల..బెదరకుండ చూడు..!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance