STORYMIRROR

# Suryakiran #

Romance

4  

# Suryakiran #

Romance

రావా ! అందజేయవా !

రావా ! అందజేయవా !

1 min
403

ఎన్నాళ్ళైందో కంటినిండా నినుచూసి ,


విరహంతో వేగుతున్నా తలచిన ప్రతిసారీ !


సందేశాల వెల్లువ ఎంతగా ఓదార్చినా ,


చెంతన లేవనే చింతే నాకనుదినం .


వేవేల మతాబులు ముంగిట్లో వెలిగినా ,


ఎగిరే పతంగులతో ఆశలెన్ని కలిగినా


మిణుకుమిణుకుమనే నక్షత్రమే నీవు ,


రాయే హృదయమై ధ్యానించే నేను .



నీవు ప్రత్యక్షమైతేనే నాకు శుభోదయం ,


చిలుకలా పలికితేనే ఆనందోదయం .


కళ్ళు మెరుపులను చిలికితే తన్మయత్వం ,


ఎర్రని ఆ పెదవులు ప్రేమగీతం పాడితే


రోజంతా నాలో మైమరచిపోయే తత్వం .



నీలో యువరసాలొలికే బ్యూటీ రష్మిక ,


ఓరచూపులు ఏరులా పారే నటి హన్సిక .



నీవు తరలివస్తే హుషారులు ఉప్పొంగే ధాత్రి .


ఎదురై వస్తే సంబరాలే జరిగే వెన్నెలరాత్రి .



రావా ! నీ కరకమలములను అందజేయవా !





Rate this content
Log in

Similar telugu poem from Romance