రాజభాష
రాజభాష
రాజభాష
(తేటగీతి మాలిక)
దేవనాగర లిపియందు దివ్యమైన
భాషగా విరాజిల్లిన భాష హింది
రమ్య మైనట్టి భారత రాజభాష
సులభతరమైనదౌ బహు సొంపు కలది
జాతి ఐక్యతా సిద్దియౌ జనుల భాష
కవులు గాయకుల్ పల్కిన కావ్యభాష
ప్రజల మైత్రికి చిహ్నమై వరలు చుండి
సంస్కృతిన్ నిల్పు చుండెడి సరసభాష
వారసత్వమై ప్రజలకు వారధివలె
వెలుగు చుండెడి హిందీని విలువ తెలిసి
నేర్చుకొనుచుండి మనవారు నిష్టతోడ
ప్రోత్సహించిన చాలును భువిని గెలిచి
స్ఫూర్తి నింపెడిదీ భాష కీర్తి యెగసి
గగన సీమను చుంబించి ఖ్యాతి నిలుపు.//
