రాగ తూణీరం
రాగ తూణీరం


ప౹౹
కోయలొకటి కూసెనూ తీయగా అలా హాయిగా
హొయలొకటి చేసెనూ మనసునే ఓ మాయగా ౹2౹
చ౹౹
పెంచిన స్వరం అంచున చేరేసి ఆశలూ పెంచెనే
మించిన భావం మంచినేపంచి ఎద కదిలించెనే ౹2౹
కొత్తవి రాగాలు కుహుకుహూ అని పరిమళించే
మెత్తని మనసున ఒహో ఒహో యని రవళించే ౹ప౹
చ౹౹
పలికినవన్నీ పల్లవించినే మదిలోనా పరవశాలై
చిలికిపవన్నీ చిన్మయాలైనే చిత్రంగా ఫలరసాలై ౹2౹
ఏరికోరిన రుచులన్నీ ఎడదలోనే విడిది చేసెను
కోరి చేరిన కొంటె రాగాలు కొత్త సందడై విరిసెను ౹ప౹
చ౹౹
పూలభావం పురివిప్పినే ఆలాపనలతో మురిసి
కాలమానం కలవరపడినే ఆ కొలతలనే మరచి ౹2౹
మళ్ళీ మళ్ళీ కూయవా మరులతో మురపించ
తుళ్ళి తుళ్ళి పాడవా రాగతూణీరం కురిపించ ౹ప౹