STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

పవిత్ర రంజాన్

పవిత్ర రంజాన్

1 min
355

ఈదులుఫితుర్ న పర్వంబునేజరుపుట

ముస్లిముల సాంప్రదాయమౌ పుణ్యదినము

సకల లోకపు శాంతికి సాధనముగ

భావనను జేసి కొల్తురా పరమ విభుని.


ఘనము రంజాను మాసంబు కలిసి యుండి 

యుపవ సించుచు భక్తితో నుదయ సంధ్య

భక్తి తోభగ వంతుని ప్రాంజలించి

గడుపు చుందురీ ముస్లింలు కరము మోడ్చి.


పర్వదినంబుల జరుపుచు బంధువులను

కూడి సంతసమొందుచు కుడుచు చుంద్రు

పరమ పథమును జూపెడి పండుగందు

సంబరంబులతో ప్రజ సాగు చుంద్రు.


Rate this content
Log in

Similar telugu poem from Classics