STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

పూజ్యమౌ మాసము

పూజ్యమౌ మాసము

1 min
12

పూజ్యమౌ మాసము.


బంగరు తల్లులు పూబంతులను దెచ్చారు

సింగారములు చేసి సిరులు పొంగించారు 


బోనాల పండుగను భోగముగ జరిపారు 

వానలో చిందేసి పాటలను పాడారు.


గోరింట పెట్టుకొని గుమికూడి మురిశారు 

తారంగ మాడుచూ దైవాన్ని కొలిచారు 


ఆషాఢమాసమని యా క్రొత్త దంపతులు 

దోషంబు వలదంచు దూరముగ జరిగారు 


రథములో దేవుళ్లు రాజవీధికి రాగ 

పథములో భక్తాళి పరుగుపెట్టుచుసాగ 


ఉర్వి జనులందరూ నుపవాసముండెదరు 

సర్వజ్ఞునికి మ్రొక్కి సంబరంబొందెదరు.


గురుపూర్ణిమదినమున గురువులను కొల్చెదరు 

స్థిరమతులు శిష్యులట దీవెనలు పొందెదరు.


 మానసమును జయించి మౌనితతి మెల్గెదరు 

జ్ఞానంబు నార్జించ జపములను చేయుదురు.


పున్నెంబులనిడునిదె పూజ్యమౌ మాసమట.

వెన్నుడిని భజియించ విజయమే తథ్యమట.//


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics