ప్రశాంతత
ప్రశాంతత
నేర్పాలను యత్నమేదొ..మానుకున్న ప్రశాంతత..!
ఎవరిగొడవ వారు తెలిసి..తీర్చుకున్న ప్రశాంతత..!
ఎవరినైన "నీది తప్పు"..అనే సంగతే తప్పోయ్..
చెలిమిమీర సవరించుట..తెలుసుకున్న ప్రశాంతత..!
గొప్పతనా లేమిలేవు..ఎఱుకతోటి సాధనయే..
జ్ఞానంతో గర్వించక..మసలుకున్న ప్రశాంతత..!
ఏకత్వపు లోగిలియే..జగమంతా గమనిస్తే..
సత్యమిదే తెలిసి సరిగ..కాచుకున్న ప్రశాంతత..!
నీ హృదయం కోటిగగన..సీమలనిధి ప్రియనేస్తం..
చైతన్యపు మూలమదే..చేరుకున్న ప్రశాంతత..!

