Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Raja Sekhar CH V

Classics Fantasy Inspirational

3  

Raja Sekhar CH V

Classics Fantasy Inspirational

ప్రణయ వీణ

ప్రణయ వీణ

1 min
243


పద్మాసనంలో ప్రారంభిచావు మృదు హస్తాలతో వీణావాదనం,

ఆలకించిన అలౌకిక నాదంతో హృదయ నాడులలో అయ్యెను స్పందనం |౧|


సంస్పర్శించెను వీణ తీగలను మీ మృదుల అంగుళం,

ఉత్తేజిత సప్తస్వరముల శృంఖలిత గతిని చేసెను సృజనం |౨|


అవిరామ నిర్మలఝరి వలె అగ్రసరం అయ్యెను సుమధుర సమ్మోహన రాగం,

ఆకృష్టమైన నా హృదయంలో మీ కోసం ఉపక్రమించెను అమితమైన అనురాగం|౩|


ప్రణయ వీణ నుండి శ్రావ్యమయ్యెను సురమ్య స్వరమయ సంగీతం,

స్వరసంగమ పారిజాతం ఇచ్చి చేసారు మీరు నన్ను ఎంతో హర్షితం |౪|


పరివాదిని ఉపయోగం ప్రయోజనంలో మీరు యేవేళ నైపుణ్య జయశ్రీ,

ఈ అనుపమ సంయోగంలో సహాయం చేస్తున్నారు వరదాయిని వాణిశ్రీ |౫|


సప్త నుండి సృష్టించెను మీరు మధుర సుమధుర సుగమ గీతం,

మీ లయబద్ధ శాస్త్రీయ సంగీతం ద్వారా అయ్యాను నేను వశీభూతం |౬|


అసహనీయం అయ్యెను మీ అవ్యక్త మౌనం,

అవిదితం ఎప్పుడు శ్రావ్యమయ్యెను మీ ప్రణయగానం |౭|


నేత్రాలు వీక్షించెను మీ అభినవ సమలంకృత రూపం,

వర్ణణాతీతం మీ అపార అపురూప సౌందర్య స్వరూపం |౮|


మానస తీపివ్యథను కథించుటకు ఆతురత చూపెను అధరం,

మీ ప్రతి ఉన్న ప్రీతి ఈ అందమైన అలౌకిక అనుభవానికి ఆధారం |౯|


మోహనవీణ అలల సదృశం మీ మధురవాణి,

మీకు అశేష ఆశీర్వచనం ప్రసాదించారు శ్రీవాణి |౧౦|


ఎలా చెయ్యాలి జీవితంలో మిమ్మల్ని సంబోధనం,

శ్రీజగన్నాథ జనార్దన ఆశీస్సులతో సునిశ్చితంగా సాకారం అవ్వాలి మన పవిత్రబంధనం |౧౦|


స్వీకరించారు అవటానినికి నా ప్రణయిని,

నా జీవితానికి నూతన దిశ ఇచ్చారు అయి నా జీవన స్వామిని |౧౧|


సదా ఆలకించటం అయ్యెను మీ మానసవీణ దివ్యవాణి,

ఆ తన్మయ తరంగాలు నా కోసం ఎప్పుడూ ఆకాశవాణి అమృతవాణి |౧౨|


ప్రణయవీణ ద్వారా అయ్యారు మీరు నా నవమల్లిక,

మన ఇరువురి జీవితాలలో నిండిపోవలెను మధుమూల మధూలిక |౧౩|


Rate this content
Log in