పరమేశ్వరా
పరమేశ్వరా


ఘోర విషాగ్ని జ్వాలలు చిమ్ముతున్నవి
కాలము పగ తీర్చుకుంటున్నట్టు
వికటాట్టహాసము చేయుచున్నది
మహాకాలుడిని నమ్మి భస్మము ధరించితిని
ఆపదల నుండి కాపాడమని
సోమవార వ్రత రూపిణి పార్వతీ మాతను అడిగితిని
హే శివ
నిత్యము నీ నామస్మరణ చేసితిని
మమ్ముల కరుణించి ఆయురారోగ్యములు ఒసగరా శ్రీకాళహస్తీశ్వరా!