STORYMIRROR

Malleswari Kolla

Drama Classics Others

4  

Malleswari Kolla

Drama Classics Others

ప్రకృతి

ప్రకృతి

1 min
410

నింగి వాకిట వెలుతురు కల్లాపి చల్లుతూ

తూర్పు కొండల నడుమ సూర్యుడు

నవ్వుతూ కదిలొచ్చిన వేళ

నిద్ర దొంతరలను విదుల్చుకుని

ప్రకృతి పురివిప్పి నాట్యమాడుతూ

ఉషస్సును ఉద్వేగపడేలా చేస్తోంది

ఆమని రాకతో అవని గుమ్మ

ఆకుపచ్చ కోకను చుట్టుకోగా

వెచ్చని అరుణోదయ కిరణాల తాకిడికి

మేఘాలన్నీ అంబరం చాటుకి చేరిపోగా

కోయిలమ్మ చేసే సరిగమల సాధనలతో

పుడమి అంతా సరికొత్త శోభను సంతరించుకుంది


Rate this content
Log in

Similar telugu poem from Drama