ప్రకృతి ప్రేమికుల
ప్రకృతి ప్రేమికుల
ఎందరెందరో ప్రకృతి ప్రేమికులు
వేచి చూస్తుంటారు ఎన్నో ఉషోదయాలు
పదిలపరుచుకోవాలని భానుని లేలేత కిరణాలు
ఆశ గా చూస్తుంటారు అహోరాత్రాలు
పట్టి బంధించాలని పక్షుల కిలకిల రావాలు
హృద్యం గా చూపాలని మృగరాజు హావభావాలు
శ్రమించి తిరుగుతుంటారు ఎన్నో దేశాలు
పోగుచేయాలని అరుదైన అందాలు
అంతరించిపోతున్న జాతుల ఆనవాళ్లు
తల్లి చుట్టూ చెంగున దూకే లేడి పిల్లల పరుగులు
ఒడుపుగా దూకే జలపాతపు హొయలు
ఝమ్మని రేగే తేనెటీగల సవ్వడులు
కానీ నేడు ఆవిరౌతున్న వారి ఆశలు
నాగరికత పేరుతో సిమెంట్ మయమౌతున్న పట్టణాలు
సుందరీకరణ మాటున కనుమరుగౌతున్న అడవులు
మనిషి ఆదిక్య పోరులో అదృశ్యమౌతున్న వలస పక్షులు
ప్రకృతి ఎంత హెచ్చరించినా మారని మానవ నైజాలు
విపత్తులెన్ని ముంచుకొచ్చినా సరిదిద్దుకోరు పొరపాట్లు
ఓ మంచి మొక్కని పెంచి చూడండి చేస్తుంది తరతరాలు మేలు
