ప్రకృతి..నిజం
ప్రకృతి..నిజం


వెలుగు రేఖలు విచ్చుకున్నాయి
కిలకిలారావాలతో రెక్కలు విప్పుకొని
ఆశల పక్షులు ఆకాశ మార్గాన
లక్ష్యం లేని అన్వేషణ కై
తిరిగి చేరుకోవలసిన లక్ష్యాన్ని మరచిపోకుండా
మంచు బింధువులు కరిగి పోతున్నాయి
గడ్డి పరకనూ పూలబాలనూ పలకరిస్తూనే
తనను తాను సమర్పించుకుంటూ
ఆవిరౌతున్న ఆశలలా
మరో రోజుకోసం ఎదురు చూస్తూ
పూలు విరబూస్తున్నాయి
సుగంధాలను విరజిమ్ముతూ
పరిసరాలను ప్రభావితంచేస్తూ
వాడిపోతామని తెలిసినా
చివరి నిముషంవరకూ చిరునవ్వుతో