STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రియా సఖీ

ప్రియా సఖీ

1 min
363

ఎదురుగ వచ్చావని పొంగిపోయి కళ్లు తెరచినవేళ కళ్లముందు నిలిచింది స్వప్నమని తెలిసి మనసు చిన్నబోయింది


చెవులను సోకిన అడుగుల సవ్వడి నిదేనని తలచి వెనుదిరిగి చూసినవేళ రాలిన ఆకులు చేసిన సవ్వడని తెలిసి హృదయం కలుక్కుమంది


ఎవరి స్వరం విన్నా అది నీదేనేమోనని మదికి తోచినవేళ కాదని తెలిసి ఊరుకోమని చెబుతుంటే మది సైతం మొరాయిస్తోంది


కరుగుతున్న మంచులా కాలం కరిగిపోతున్నా నీకూ నాకూ మధ్య దూరం మాత్రం ఎందుకో నిత్యం పెరుగుతూనే ఉంది ఎన్నాళ్లీ ఎదురుచూపులంటూ మనసు నిత్యం రోదిస్తుంటే... దానికేం చెప్పాలో తెలియక హృదయం తల్లడిల్లుతోంది.


ప్రేమకు శక్తి ఉందో లేదో తెలియదుకానీ... నిన్ను చూశాకే నా మనసు పొరల్లో స్పందన నాకు వినిపించింది. కానీ ఎందుకో నేను ఎరగనుకానీ... నాలోని స్పందన నీకు మాత్రం వినిపించనంటోంది.


అయినాసరే నిను చూశాక నాలో చెలరేగిన ప్రేమనే ఈ అలల తాకిడి నిన్ను సైతం తాకే వరకు ఇలాగే మౌనంగా నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. కరుణించినా... కాదంటూ నన్ను గెంటేసినా నీకోసం సాగిస్తున్న ఈ నిరీక్షణ మాత్రం ఆగిపోదు సుమా.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance