STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రియా భావన

ప్రియా భావన

1 min
252


ఊరుతున్న మధువు కదా..నిను గూర్చిన ప్రియ భావన..!!

ఉరుముతున్న మబ్బు కదా..నిను గూర్చిన ప్రియ భావన..!!


అల్లుకున్న వెన్నెలల్లె..మనసుపూల తోట లోన..

కురియుచున్న మంచు కదా..నిను గూర్చిన ప్రియ భావన..!!


యుగాలన్ని క్షణములేగ..నీ తలపుల ఆకసాన..

వెలుగుచున్న నవ్వు కదా..నిను గూర్చిన ప్రియ భావన..!!


మన కలయిక తీపి కలగ..మది మిగిల్చి వెళ్ళినావు..!!

కదలకున్న నివురు కదా..నిను గూర్చిన ప్రియ భావన..!!


తాపమేల నశియించదొ..తనువులోన ఏ వేళను..!?

మండుతున్న రణము కదా..నిను గూర్చిన ప్రియ భావన..!!


'మనసు'నిక వదలవమ్మ..నీ పూజగ నేనుంటిని..!!

ఆరకున్న చిచ్చు కదా.. నిను గూర్చిన ప్రియ భావన..!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance