Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ఈవని రవిశంకర శర్మ

Romance

4.5  

ఈవని రవిశంకర శర్మ

Romance

ప్రేమవెన్నెల !

ప్రేమవెన్నెల !

1 min
374


ఎవరిలో కలిగినా ,

ప్రేమ ఒక అద్భుత ఆలాపన .

అప్పుడు ఆవల

ఏమీ లేదనిపించే భావన .


నిండైన వెలుగు

చుట్టుప్రక్కల ఆవహించు .

సుస్వరాలు పలికినట్లు

తనువు గొప్పగా పులకించు .


మధురంగా మాట్లాడుటకు

మనసు ఉవ్విళ్ళూరు .

అడుగడుగులో

చైతన్యజ్వాల ప్రజ్వరిల్లు .


తీగెపై పూలెన్నో

అందాన్ని అలంకరించినట్లు .

నీటితో నదులెన్నో

గలగలా ప్రవహించినట్లు .


ప్రత్యేకంగా ప్రేమికుల్లో

తెల్లని నవ్వుల తరంగాలు .

పండువెన్నెలలో

మరుమల్లెల సుగంధాలు .



Rate this content
Log in

Similar telugu poem from Romance