Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Romance

4.5  

Eevani Ravisankara Sarma

Romance

ప్రేమను పెంచావ్ ! ❤️

ప్రేమను పెంచావ్ ! ❤️

1 min
453


ఎగిరే పక్షులతో ఆకాశం ,

పెరిగే మొక్కలతో భూమి సువిశాలం .

వీటిలో రోజూ ఎన్నోమార్పులు ,

మనిషి మనుగడకవి

సహజంగా ప్రేరణయ్యే కూర్పులు .

ఏవి లేకున్నా నిట్టూర్పులు ,

రాకకోసం ఆశగా ఎదురుచూపులు .

అదేకదా అవినాభావ సంబంధమంటే ,

పర్యావరణంతో ఏర్పడే ప్రేమంటే !


నీవు కొమ్మమీది పూవైతే ,

నీ మాట చిందే మకరందం .

నీవు కదిలే మేఘమైతే ,

నీ ప్రేమ అది కురిపించే వర్షం !

అందుకే ఈరోజు ...

నీవింకా కనిపించలేదనే నా ఆవేదన ,

అక్షరాల్లో ఇలా స్పందన నీకు నివేదన .

నవ్వుతూ పలకరిస్తే ,

పులకించదా అపురూపమైన నా ప్రాణం ,

కలవరించదా మది

అందుకుని పరవశించాలని నీ వలపుబాణం !

నీదీ ఆ ఆశే లే .

నాకోసం వేచి వేచి , బంధనాలను తెంచుకుని

ఏతెంచావ్ !

మనమధ్య ప్రేమను పెంచావ్ !!




Rate this content
Log in

Similar telugu poem from Romance