STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

ప్రేమలో

ప్రేమలో

1 min
8


పదాలతో ఆడుకోగ..అలుపుండదు ప్రేమలో..! 

రాగభావ మధురిమలకు..అడ్డుండదు ప్రేమలో..! 


కరిగిపోవు అందాలను..పొగడేపని ఏమిటో.. 

పనికిరాని వెర్రితనం..అసలుండదు ప్రేమలో..! 


నీ గుణాలు నీకు పట్టి..చూపాల్సిన దెవరటోయ్.. 

ఆలోచనలో మకిలకు..తావుండదు ప్రేమలో..! 


అవసరాలు పెరిగేనోయ్..కోర్కెలింట చేరితే.. 

నీ సహనం గాకుండా..ధనముండదు ప్రేమలో..! 


గెలుపుగొడవ దేనికటా..అనుభవాల పొదరింట.. 

దరహాసమె నేస్తమోయి..పట్టుండదు ప్రేమలో..! 


ఒక పాటల సెలయేఱే..గమనిస్తే నీ మనసు.. 

మౌననదీ వాహినులకు..గట్టుండదు ప్రేమలో..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance