STORYMIRROR

# Suryakiran #

Romance

4  

# Suryakiran #

Romance

ప్రేమకు గుర్తుగా ..!

ప్రేమకు గుర్తుగా ..!

1 min
479


షాజహాన్ మాటల్లో ...

" నాకు మదిలో ప్రేమభావం కలింగిందో శుభదినం .

మరిచిపోలేని తలపులే నాటినుండి ప్రతిక్షణం .

కళ్ళముందు ఆమె అందమైన రూపం కదిలెనా ...

ముసిముసి నవ్వులు నాకోసం రువ్వెనా ...

ఏమని చెప్పను ... నా మనసు ఉరకలు వేసెను .

హృదయంలో చిలిపి కోర్కెలు రేగెను .

ముంతాజ్ , నీతోనే సరాగాల పల్లకి అని తెలిపా .

ప్రణయగీతికలు కోటగోడలు ప్రతిధ్వనించేలా పాడా .

వజ్రాభరణాలనెన్నిటినో కానుకగా పంపా .

రాణివాసానికి ఆహ్వానం మనోహరంగా పలికా .

పులకరించి , పరవసించి తనే లోకంగా జీవించా .

మనసుపూదోటలో సమ్మోహన స్మృతులను రచించా .

ప్రజల మనోఫలకంపై ముచ్చటైన జంటగా పేరు .

యమునా తీరాన ప్రేమ సౌధమై నిలిచింది చూడు . "



Rate this content
Log in

Similar telugu poem from Romance