ప్రేమించు
ప్రేమించు
ప్రేమించవా నన్ను....
నన్నుగానే
జీవించవా
నాకోసమే
నాకు.తోడుగా
ఆలంబనగా
ప్రేమించవా నన్ను.....
జల పుష్పం జలరాశిని ప్రేమించి నట్టు
కోకిల తన గాత్రాన్ని ప్రేమించినట్టు
ప్రేమించవా నన్ను....
తేటి తేనెను ప్రేమించినట్టు
పక్షి తన రెక్కలను ప్రేమించినట్టు
ప్రేమంచవా నన్ను....
పట్టుకో.....
గట్టిగా..
ఆత్మస్థైర్యాన్నిస్తూ
ఆత్మసంధానం చేస్తూ
ప్రేమించవా నన్ను....
నీ శక్తి నంతా వినియోగించి
నాచుట్టూ ఓ దుర్గంగా నిలువు
రాత్రి నన్ను గట్టిగా పొదివిపట్టినట్టు
ప్రేమించు నన్ను....
నా పెదవులపై నీ పెదవులతో
గట్టిగా ఆదిమినట్టు
నాలోని గుండె స్పంధించి నట్టు
... సిరి ✍️❤️

