STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రేమాభిషేకం

ప్రేమాభిషేకం

1 min
4


మనోవైకల్యం లేని మంచిమనసుకు హృదయాభిషేకం,

అడ్డురాని అంగవైకల్యపు

ఆదర్షానికి పుష్పాభిషేకం,

వృద్దాప్యపు మాతృముర్తిపై ఆత్మీయ జ్ఞానవెలుగులకు 

అనుబంధపు అభిషేకం,

ప్రేమామృతపు మధురభావనల ఊహకు

ఆనందాభిషేకం,

గుండెలోని చీకటిని పారద్రోలే చిరుదీపపు ఆశకు మమతాభిషేకం,

కలగాని సత్యంలోని జీవనమధువుకు సంతోషసరాగాభిషేకం,

వేదించిన కన్నీళ్లకు

ఎదురైన మురిపాల మమకారపు ముచ్చటకు విజయాభిషేకం,

మౌనరాగపు తలపుల మానసానికి పరవషాభిషేకం,

స్వచ్ఛప్రేమల దరహాసానికి

అనురాగపు అభిషేకం,

నిత్యపున్నమిగా మారిన బ్రతుకు చిత్రానికి అమృతాభిషేకం,

వెలతికాని ప్రేమాదర్షపు జీవితపులకింతకు అపురూప విజయాభిషేకం.

కష్టాల వెతలకు

తరిగిపోని ఓర్పుకు తల్లీకొడుకుల ప్రేమాపాశానికి

లోకం చేస్తుంది వాత్సల్యాభిషేకం.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance