STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రేమ

ప్రేమ

1 min
352

నన్ను పెళ్ళిచేసుకుంది.. విరహానికి ఎంత ప్రేమ..!

నా స్నేహం వదులుకుంది.. కోపానికి ఎంత ప్రేమ..!


తియ్యనైన జ్ఞాపకమే..చూపలేని గాయం కద..

వరుస కట్టి పాడుకుంది.రాగానికి ఎంత ప్రేమ..!


మోసమింత చేయలేని..ఆశ అసలు ఎక్కడుంది..

తీగలాగ చుట్టుకుంది..మోహానికి ఎంత ప్రేమ..!


అనుబంధపు గంధమేమొ..అలలకడలి అంచులలో..

అవకాశం చూసుకుంది..తీరానికి ఎంత ప్రేమ..!


ఆధారం తెలియకనే..జరుగుతోంది పెనుగులాట..

మనసును పెనవేసుకుంది..పరువానికి ఎంత ప్రేమ..!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance