STORYMIRROR

Ramesh Babu Kommineni

Drama

4.8  

Ramesh Babu Kommineni

Drama

ప్రేమ-వ్యాపకం

ప్రేమ-వ్యాపకం

1 min
336


ప౹౹

ప్రేమొక వ్యసనము అయిందిగా మనసా

ప్రముఖ వ్యాపకంగా మిగిలిందీ తెలుసా౹2౹


చ౹౹

నదిలా సాగి వరదై పొంగే వలపు వాలకం

కథలా కదిలి కలలా తోచే తలపు లోలకం ౹2౹

వ్యధతో సాగే మనసు కోరేది స్వాంతనమే

ఎదలోని కల్పనలే కవ్వించు చిలిపితనమే ౹ప౹


చ౹౹

ఉదయకాలపు మంచులా కమ్మే ఊహలు

ఏదో స్వర్గం ఎదనే గిల్లగా పొంగే భావాలు ౹2౹

గుండెలో ఏదో తెలియని గుబులే రేపాయి

మండిన తడి మంటే తనువునే కలిపాయి ౹ప౹


చ౹౹

కదిలే మేఘమే వలపు వర్తమానం వర్షించ

కడలి నాదమై కలను నిజమే చేసి హర్షించ ౹2౹

ఆ స్వప్నమే అందివచ్చి మదిలో పులకించి

ఏ స్వాప్నికుని కోరికనో పరికించి ఆలకించి ౹ప౹


చ౹౹

నిదురలలోనూ కలవరింతలే ప్రేమకోసరమే

చెదరిన మనసుకు కలలో చేర్పు అవసరమే ౹2౹

చెంతచేరి చింతనే పెంచెనూ కోరిన వ్యసనం

అంతకంతకూ అలా పెరుగుటే దాని లక్షణం ౹ప౹


Rate this content
Log in

Similar telugu poem from Drama