ప్రేమ పూల
ప్రేమ పూల
చెలునిమనసు కందలేదు..ప్రేమపూల తీగవిలువ..!
తేనెచుక్క కందెనేమొ..చెలియకంటి చుక్కవిలువ..!
పొంగుతున్న మధువంటే..విరహగీతి గాకేమిటి..
మేఘానికి తెలిసెనేమొ..గుండెచాటు వానవిలువ..!
చూడడు ఇటు రాడెంతకు..ఆ జాబిలి నయంకదా..
నెలవంకయె ఎఱుగునేమొ..నాడెపుడో ప్రేమవిలువ..!
ప్రాణమెంత యాతనలో..మునిగిందో తనకోసం..
హంసకైన పట్టెనేమొ..ఈ నెచ్చలి శ్వాసవిలువ..!
ఎన్నికథలు కబురులెన్ని..చెప్పెనోయి కలనుచేరి..
ఒక కోకిల పాడునేమొ..అనుభవించు కలతవిలువ..!
నిజమిదెంత భారమంటె..తూచగల్గు వాడెచటో..
ఊహించగ కష్టమాయె..వీడలేని మాయవిలువ..

