నీ ప్రేమ
నీ ప్రేమ
నీ ప్రేమ......
నను నిలువెల్లా తడిపే వెన్నెల జలపాతం
నా మదిలోఎపుడూ వినిపించే నవమోహన రాగం
నా కన్నుల్లో దాగున్న సుందర స్వప్నం
నా మనసులో నిశ్శబ్దంగా పాడే సంగీతం
నా పెదవులలో కనిపించే చిరునవ్వుల సుప్రభాతం
నా గుండెలో సందడి చేసే మధుమాసపు కోయిల గానం ఎల్లవేళలా
నను పరవశింప చేసే ఆమని రుతురాగం చిగురించు
ఆశలపై కురిపించు తొలకరి మేఘురాగం,
ఏ జన్మ వీడని జన్మజన్మల అనుబంధం

