అంతమై పోతున్నా...
అంతమై పోతున్నా...
అంతమై పోతున్న ఎగరడానికి..
ఏ హద్దులు లేవంటూ ఆకాశానికి హద్దులు గీస్తూ..
అంతులేని ఆవేదనల తీరంలో విహరిస్తూ..
ఎగరడానికి లేని రెక్కల కోసం ఎదురు చూస్తున్న.
అనంతమైన ఆలోచనలోయలలో అంతమైపోతున్న.
తీరం లేని ఎడారిలో అలసటతో అర్రులు చాస్తున్న.
భేషజాల మనుగడలో బంధీనై ఊపిరి తీస్తున్న.
నిశ్శబ్ద గూడులో నిరంతరం తపస్సు చేస్తున్న.
ఆయువు ఆవర్తనం అయి అంతమైపోతున్న.....
... సిరి ✍️❤️

