STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసు బరువు

మనసు బరువు

1 min
258

మనసు బరువు రెట్టింపు అవుతుంది..!!


హృదయాన్ని ఎక్కడో భద్రపరిచి

ఖాళీ దేహముతో శూన్యములో తిరుగుతుంటే

పాదాలను నేలపై కదిలిస్తూ 

రెండు కళ్ళతో తెలియని లోకాన్ని వెతుకుతున్నాయి..


సముద్రపు ఆటుపోట్లు చుట్టే వలలు వేస్తే

కష్టాల త్రిమింగలం పక్కన తిష్టవేసి కూర్చుంది

సుడులు ఎక్కడికో లాగేస్తున్నట్లు ఉంటే

ఇసుక రేణువులు కనిపించని అగాధం లోనికి....


బ్రతుకు బాటల వెంట కొండచిలువల ఆకారమే

తాడును చూసిన భ్రమలు సృష్టిస్తుంది

పాలు తాగిన పాము విషాన్ని ఇస్తున్నట్లు

మంచిని జోడిస్తే శత్రువై వెంటాడుతుంది ఈర్ష్య...


ఉన్నతికి అడుగు అంగుళం కూడా జరగకుంటే

మనసు బరువు రెట్టింపవుతుంది 

అనుభవాన్ని రాయడానికి భాషతో సరిపోలిస్తే

మేధస్సులో ఉద్విగ్నం శిఖరమై చూస్తుంది..


మానవత్వానికి భౌతిక దూరం పెరుగుతుంది

కన్నీళ్ళలో దృశ్యమాలిక కనిపిస్తుంది

స్పష్టమైన బంధుత్వములో డబ్బు రాజ్యమేలుతోంది

సరిహద్దు రేఖల్లో దాయాదుల పోరు జరుగుతుంది..


ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది తల్లిదండ్రుల రక్తంలో 

కన్నప్రేగులలోని అలసిన మాధుర్యపు రుచి

స్తన్యం తాగిన బిడ్డల మధ్య వైరం పెరుగుతుంటె

ఆ తల్లి కళ్ళలో కన్నీళ్లు హిమగిరిలా కారుతుంది..


వెళ్తున్నది జీవితపు నౌక గమ్యం తెలియక

ఆశల అలలు దొబ్బుతున్నంతకాలం జారుకుంటూ

కనిపించని స్వప్నలోకం కోసం విహరిస్తూ

వదులుకుంటున్న బాంధవ్యాల లోని తీపి గుర్తులు..



Rate this content
Log in

Similar telugu poem from Romance