నాలోని భావాలు
నాలోని భావాలు
ఎన్నటికి తరగనివి నా లోని భావాలు
నీ స్మృతుల మధురాలు మదిమీటు భావాలు
వాడేటి వస్తువున నీ రూపు చూస్తాను
మలినమే లేనట్టి విమలత్వ భావాలు
ఏ పూర్వబంధమో ఎందుకో కలిసాము
నీ నామ స్మరణతో ధ్వనియించు భావాలు
దేహాలు కనుమరుగు దేశాలు తెరమరుగు
మరణమే లేనట్టి అమరత్వ భావాలు
ఏదౌను శాశ్వతము? ఇహలోక బంధాలు
కన్నీటి ధారలై కురిశేటి భావాలు

