STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీవు నా తోడుగా నేను నీతోడుగా

నీవు నా తోడుగా నేను నీతోడుగా

1 min
408

నీవు నాతోడుగా - నేను నీ నీడగా"


ప్రేమ ఎంత మధురం!

ప్రియమైనవారు అంత మనోహరం!


కల్లలు లేని మన ప్రణయ గీతం!

మనస్సు పరిణయం తో ముడిపెడదాం!


నీతో నడచిన నా ప్రతి అడుగు!

మన పాపడు వేసిన తొలిఅడుగు!


నీ తోడుగా సాగే నా పయనం!

వెన్నెల కురిపించే చల్లదనం!


నిన్ను తలచిన చాలు మదిలో!

జేగంటల సందడి ఎదలయలో!


మనస్సున నిండైన నీ రూపు!

కదలును అరుదైన నీ చూపు!


నీమది పలుకును ఎన్నో రాగాలు!

ఎగసి పడును నాలో మౌనరాగాలు!


ఎందుకు నాలో ఈ అందమైన అలజడి!

అందుకు జవాబు నీ చరణాల చిరు అలికిడి!


ఉరిమి ఉరుకుతోంది నల్లని మొయిలు!

కురుస్తోంది చల్లని ముత్యాల

ఝల్లులు!


మేలు మేలు ఇక మన ఇద్దరి కలయిక!

నీవే నేనుగ మరి ఎందరికో

స్ఫూర్తి ఇక!


"ఏ పూర్వ పుణ్యమో " ఈ జన్మ లో నీచేయి అందుకున్నాను! 

మరు జన్మ ఉంటే నీ సహధర్మ చారిణిగా జీవిస్తాను

బంగారం !


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance