ప్రేమ క్రతువు
ప్రేమ క్రతువు
ప౹౹
లేక లేక లేఖ ఒకటి రాశాను లేదనక
ఒక మాట వింటావా నీవూ కాదనక ౹2౹
చ౹౹
కనుగొన్నానులే కమనీయం కళ్ళలో
పాడుకున్నానులే శ్రుతిలయం కళలో ౹2౹
ఈ నవగీతం నడిపించే నవలోకంలో
అనుభవ సారముంచే ఏదో మైకంలో ౹ప౹
చ౹౹
ఎదనిండిన ముసిమే అర్పించేయను
ఎంత కూరిమో ఎలా వెలికి తీయను ౹2౹
మరీ చెప్పిన అ వలపులతో సందేశం
గురి తప్పునో అని ఎక్కడో సందేహం ౹ప౹
చ౹౹
ప్రేమ ఋతువులో పెన్నిధై కనిపించి
ఆ ఎలమి క్రతువు కోసమై ఆరాధించి ౹2౹
జరిపించవా జగమెరిగిన జనాంతికం
మురిపించవా గెలచి మరులాంతకం ౹ప౹