STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

పోతాను

పోతాను

1 min
3


విరహమెంత బాధ తలచి ధ్యానంలో నిలిచి పోతాను

శిలగ మారికూడ పిలుపు నీదైతే కరిగి పోతాను


విరులు పూసినట్లు కనుల నవ్వులతో నువ్వు వస్తావు

అలక మరిచి నేను ఎడద పానుపుపై ఒరిగి పోతాను


కబురు లేకున్నా కాన రాకున్నా అదొక నరకమే

కడకు వాస్తవమే తెలిసి లోలోనే నలిగి పోతాను


పరిధి లేని ప్రేమ నీది నిజమన్నది ఋజువు చేస్తావు

నీవు గీతికవై నేను గానమునై కలిసి పోతాను


ఎవరి ప్రేమ ఎవరి మీదెక్కువో సదా వాదులాటే

తెలివి నీసొంతం గెలుపు నీదైనా మురిసి పోతాను


నాడు నేనొక తారకని నీ ఊహల ఆకాశంలో

ఇపుడు నింగంటే నువ్వు, వెన్నెలగా మెరిసి పోతాను


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance