STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

పండించే ప్రేమ నీది

పండించే ప్రేమ నీది

1 min
2

ఈ తప్పని వెతుకులాట..మధురమనే చెబుతాలే..! 

ఊహమాటు నీ రూపం.. పదిలమనే చెబుతాలే..! 


ఈ కన్నుల ఆరాటం..పండించే ప్రేమ నీది.. 

నిను కలవక ఈ ఊపిరి..వ్యర్థమనే చెబుతాలే..! 


ఈ గాలికి ఆ నిప్పుకు..లంకె ఎలా కుదిరిందో.. 

చిత్రమైన ఈ కల'యిక..దివ్యమనే చెబుతాలే..! 


నదులన్నీ కడలి చేరి..రుచిని ఎలా కోల్పోయెనొ.. 

ఒక సమర్పణమే నిజం..సౌఖ్యమనే చెబుతాలే..! 


గొడవంతా ఈ 'నేను'ను..తృప్తిపరచు ముచ్చట కద.. 

అహంకార దర్పణమది..అడ్డమనే చెబుతాలే..! 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance