STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Classics

4  

Venkata Rama Seshu Nandagiri

Classics

పల్లెలో సంధ్య వెలుగులు

పల్లెలో సంధ్య వెలుగులు

1 min
308

సాయం సంధ్య వెలుగులలో సూర్యబింబం ఎరుపువర్ణం దాల్చింది

పుడమికి చక్కని ‌సొబగులను సంధ్య వెలుగు చేకూర్చింది.

మలి సంధ్య కాంతులలో పుడమి కెంజాయ రంగులీను తున్నది.

పచ్చని పొలాలపై నీరెండ పడి రంగరంగుల కాంతులీనుతున్నది

కనులకు పచ్చని పొలాలపై ఎగిరే పిట్టలు కనువిందు చేస్తున్నాయి

కలరవం చేస్తూ పక్షులు తమ తమ‌ గూళ్ళను

చేరుకుంటున్నాయి.

మేతకెళ్ళి తిరిగి వస్తున్న పశువులతో రహదారులు సందడి చేస్తున్నాయి.

పొలాల నుండి తిరిగి వస్తున్న రైతన్నలు కష్టసుఖాలు

కలబోసుకుంటున్నారు

రచ్చబండ వైపుగా ఊరిపెద్దలు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.

ఆటలనుండి ఇళ్ళకు పిల్లలు గోల గోలగా అరుస్తూ, వెళ్తున్నారు.

నీటి కుండలతో పల్లె పడుచులు కిలకిలాడుతూ వస్తున్నారు

చెణుకులు రువ్వుతున్నారు వారిపై దారికాచిన కుర్రకారు

వంటకై రాజేసిన పొయ్యిల నుండి పొగలు రాజు కుంటున్నాయి

ఒక రకమైన వాసనలు వాతావరణంలో అలుముకున్నాయి

తన చుక్కల పైటను ప్రకృతి కాంత మెలమెల్లగా ఆకాశంలో పరుస్తూంది.

వేరొక చోట వెలుగులను పంచడానికి భానుడు శలవు తీసుకున్నాడు.


Rate this content
Log in

Similar telugu poem from Classics