పిల్లలు -ఆటలు
పిల్లలు -ఆటలు
----------------------------
తొక్కుడు బిళ్ళల నాడుచు
తోషము నిండిన కన్నులతో
చక్కని పిల్లల మోమున
జాఱెను నవ్వుల ముత్యములే
ఎక్కడ నెక్కడ నాటలు?
ఈతరమందున లేవటే!
చిక్కుకు పోయెను బాల్యము
సెల్లుల చక్రపు నాటలలో
కోతికొమ్మల యాట లేవిట?
కూడియుండుటనేర్పరే?
చేతి యందున సెల్లు పెట్టిన జీవితంబులు నిల్చునా!
పాత కాలపు యాటలన్నవి బాగు చేయును పిల్లలన్
నీతి సూత్రము లవ్వి తెల్పును నేర్చినన్ గడు శ్రద్ధతో.
ఇంటి కొక్కరు పిల్లలై యిరుకు గదుల
బెరుగు చుండిరి ఖైదులో బీదలగుచు
మట్టి వాసన తెలియక మతులు పోయి
భావి తరమీవిధంబుగ బ్రతుకు చుండె.
బడులలో తీరికేదిట? బాల్య మందు
చదువు లంచును పిల్లల మెదడు తినగ
ప్రకృతి యనుమాట తెలియని భావి తరము
మందబుద్ధితో మెల్గుట మంచిదగున?
తల్లి తండ్రులు గురువులు తప్పు తెలిసి
తల్చ వలయునుమంచిదౌ దారినిపుడు
బాల లందరు హాయిగా నాడుకొనుచు
ఆయురారోగ్యముల తోడనవని యందు
పూవులై విరబూయుచు జీవనమున
సాగ వలయును సౌభాగ్య సౌఖ్య మలర//
-------------------------------
