ఓర్పు
ఓర్పు


పద్యం:
ఫలములున్న చెట్లు నేల కొరుగునట్లు
పలుకు నందు పద్య పరవశముకు
ధరణి వంటి వోర్పు ధరియించు సుకవిలా
బుద్ధిధారి దివ్య పుస్తకాంబ
భావం:
బుద్ధిని ధరించిన దివ్యమైన రూపం గల తల్లీ పుస్తకమాతా(సరస్వతీ)! పండ్లు బాగా కాసిన చెట్లు నేల కి వంగినట్లు, మనం మాట్లాడే ప్రతీ మాట పద్యం గా పరవశం అవ్వాలంటే..... మంచి కవికి ఉన్నట్లు భూమాత కు ఉన్నంత ఓర్పు ను ధరించి ఉండాలి.