ఓం వేధన
ఓం వేధన
అనుభవించే వారికే తెలుసు బాధ.
చూసే వారికి తెలియదు.
పైకి నవ్వులు చూస్తారు.
కన్నీళ్ళు ఎవరికి కనబడవు.
లోలోన కుమిలిపోయేది చూడరు.
ఎంత వెలుగులో ఉన్నా
చీకటి కనబడుతుంది.
పైకి అందంగా కనబడిన.
లోలోన కుమిలిపోతాడు.
ఎవరి బాధ ఎవరికి పట్టదు.
అలా నెట్టుకురావడమే.
సమస్యలతో సతమతమై చిక్కుకుపోతున్నాడు.
మౌనంగా ఉన్నా మనిషి ఎవరికి తెలియకుండా
పెద్దయుద్ధమే చేస్తున్నాడు.
చూసే వాళ్లకు ఒక్కడిగా కనబడుతున్నాడు.
ఆయనలో ఇద్దరు ఉన్నారని ఆయనకే తెలుసు.
ఈరోజుల్లో ఎవరి బాధ
వారికే బరువుగా కనబడుతుంది..
