STORYMIRROR

ARJUNAIAH NARRA

Fantasy

4  

ARJUNAIAH NARRA

Fantasy

ఓ సమీరమా!

ఓ సమీరమా!

1 min
665

ఓ సమీరమా!

మెల్లగా తరలి వచ్చి 

నా లేత బుగ్గలను గిల్లమాకే

అతని ఉసులను మోసుకొచ్చి 

నా చెవిలో గుసాగుసలాడమాకే

పువ్వుల పరిమళాన్ని నీ దోసిలల్లో

పట్టుకొచ్చి నా తనువుకు పూయమాకే

అతని రసరమ్యమైన మాటలతో

నా మదిని నింపి నా మనసుకు హాయిని

నా దేహానికి హానిని చేయమాకే


నీ పిల్లగాలి పిలుపుతో నాకళ్ళు  

అతని రాక కోసం ఎదురుచూస్తున్నాయి

నీ చల్లని స్పర్శ అతని 

చిలిపి గిలిగింతలను గుర్తుచేస్తుంది

నీ వెచ్చని గాలి అతని నులివెచ్చని

కౌగిలిలో పొందిన ఆనందంలా ఉంది

నీ కొండ గాలి మా శ్వాస నిశ్వాసల 

నిట్టూర్పుల బుస బుసల వలే వీస్తుంది

నీ హోరు గాలి అతనిని పెనవేసుకుని

పెనుగులాడుతున్న జోరులా ఉంది


నీ పైరు గాలికి నాపూల పైట జారి పోతే 

నేను అతని ఎదుట సిగ్గు పడుతూ 

ముఖం దాచుకునెలా చేసింది నీవు కాదా!

జివ్వుమని వీస్తూ నా గుండెలను 

హాట్ ఎయిర్ బెలూన్లగా నింపి 

అతని చేష్టలతో నా నరాలలో జివ్వుమనే 

అనుభూతిని కలిగిస్తున్నది నీవు కదా!


నా దేహమందు విరిసిన సువాసనలను 

నీ వసంతం గాలితో దాహంగొన్న 

అతని దేహానికి హాయిని పుచ్చవా

నా కురులలో తురిమిన మరుల మత్తును 

నీ చిరుగాలితో అతని శ్వాసలో కలిపేసి 

వేణువులుది మా ప్రేమ ఆనవాళ్లను 

అమర ప్రేమికులుగా ఈ ప్రపంచానికి 

చూపించి మమ్ములను ఆశీర్వదించ రావా!

ఓ సమీరమ!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy