STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఓ మర మనిషి

ఓ మర మనిషి

1 min
3

ఓ మర మనిషి...
ఈ ప్రాణం శాశ్వతం కాదురా
ఈ భూమి మీద నీ బతుకు అద్దెరా
గాలి ఆగితే ఊపిరి ఆడని బతుకులురా
నా కులం, నా జాతి అని ఎగిరి పడకురా
మనిషివని మరచిపోకురా...
ధర్మం తప్పితే కర్మ తప్పదురా
రాత రాసిన బ్రహ్మ కూడా కర్మను ఆపలేడురా...
చేసిన ప్రతి పని నీ వెంట నడుస్తుందిరా
నాటిన ప్రతి విత్తనం ఫలమై తిరిగి వస్తుందిరా
అహంకారంతో నడిచిన అడుగులు
చివరికి బూడిదై పోతాయిరా
వివేకంతో మసలుకోరా
అజ్ఞానాన్ని విసర్జించరా
జ్ఞానాన్ని ధరించరా...
నీ పుట్టుకకు ఒక అర్థం ఉందిరా
ఆత్మశోధన చేసి పరమార్థం వెతకరా
ప్రేమ పంచే చేతులే నిజమైన పూజలురా
మానవత్వమే ఈ జన్మకు ఆభరణమురా...
ఓ మర మనిషి...
సంపద, శరీరం శాశ్వతం కాదురా
మిగిలేది మంచితనమే అదే నీ చిరునామా రా
ధర్మమే నీ దారి కావాలి
సత్యమే నీ తోడు కావాలి
మనిషిగా పుట్టిన జన్మను...
మానవత్వంతో నిలబెట్టురా...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics