ఒకనాటి కల
ఒకనాటి కల


ప౹౹ ఒకనాటి కలను ఉల్లేఖించగా మరల ఒకసారి ఏనాటి తలపునో లిఖించగా తలచి మరోసారి ౹2౹
చ౹౹ కలహంసలా కదలగ కదిలినే మదిలో కలకువ వెలిగించలా ఆ జ్ఞాపకాన్నీ కలిగించ మెలుకువ ౹2౹
ఎంతటి నులివెచ్చని హాయినిచ్చునో స్మరణలో అంతటి అపురూపమే రాచిలుకా అనుకరణలో ౹ప౹
చ౹౹ గారాల బొమ్మకు వారాల నగలు వాసిగా చేరగ సింగారాల కొమ్మకు సిరివెన్నెలే తోడునూ కోరగ ౹2౹
వలపు వైరాగ్యమే తొలగ సఖుడే సరసమాడినే మలపు లేని మగువ మనసూ కువ కువలాడినే ౹ప౹
చ౹౹ సన్నజాజులు సంపెంగలే ఆ మోములో విరిసినే వన్నె వెలుగుల వనమంత సంబరాలై మురిసినే ౹2౹
కోరిన వరాలూ కొంగున కట్టగ కోలాహలమయ్యే నెరవేరినా ఆశలతో నెరజాణ తలమునకలయ్యే ౹ప౹