ఒక్క క్షణం
ఒక్క క్షణం
గుండెల్లో బాధ అగ్నిపర్వతాలై
బద్దలవుతుంటే
కళ్ళు నదులై పారుతున్నప్పుడు
నిరాశ మనసును మెలిపెట్టి
నిన్ను చీకటిలో నిలబడితే
ఒంటరైన మదికి
ఓదార్పు చేయి దూరమైనప్పుడు
ఎదను పాడు ఆలోచనలు
ముళ్ళై గుచ్చుతాయి.
విచక్షణ మొద్దుబారి
బలమైన కోరిక
నిన్ను కొత్తలోకం వైపుకు లాకెళ్లిపోతుంది
బలీయమైన శరీరం అనుచరిస్తుంది.
బలహీనమైన ఆ ఒక్క క్షణం
నీ ఆలోచనకు అడ్డుకట్టలు వేసి
విచక్షణా వెలుగులు నీ హృదయంలో నింపావో
ఆరిపోయే ప్రాణం
ఎందరికో ఆదర్శమై
ఎన్నో పాఠాలు నేర్పుతుంది.
