నయగారము
నయగారము
ॐॐॐ
శీర్షిక ::నయగారము
రుబాయిలు..
నునుగారుచు దేహమ్ముగ నీనవ్వులె చాలునురా
మన మందున నీనామమె మాటకొటియె యిచ్చెనురా!!
నిను గోరుచు యుండి తినే నిత్యమ్మ దియెదేవరా
కనులందున నీరూపమె కనువిందు గ నిల్చెను రా!!
కెందామర నీచెంతన కేలు మోడ్చి చూసెనురా
అందాలకు అంబుధిలో ఆనందము పొంగెనురా!!
గోపెమ్మలు నీరాకకు గోప్యంగా వేచెనురా
పాపాలను శాపాలను బాపంగా కోరెనురా!! 1
వేదంబులు మ్రోగంగ వేవేలుగ భోగాలే
నాదంబుల హారతులలొ నాట్యాలవి సాగెనులే!!
పరమార్థము గ్రహియించితి పాహి యనుచు కన్నయ్యరొ
పరంధామ! మురారివై పంతంబుగ రావయ్యరొ!!
కష్టాలకు నేనింకను కన్నీటిని కార్చలేను
ఇష్టముగా నీ చెంతకు నీ ప్రాణము పంపలేను!!
జీవితమున కైవల్యమే చిక్కంగా గోరుచుంటి
సావిరహే తవదీనా సాకారం చేయుచుంటి!!
✍️చావలి బాలకృష్ణవేణి
హైదరాబాద్..
