STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

నవదుర్గలు

నవదుర్గలు

1 min
232


తేటగీతులు /

1.

'శైలపుత్రిక 'సూర్యతేజస్సు పగిది 

వెల్గులీనుచు చెలువొందె ప్రీతి గొలుప

పూజ సల్పుచు శంభుని పొందగోరి

శుద్ధ పరి వేషిత వెడలె

 శోభనముగ/

2.

'బ్రహ్మచారిణి'యై హిమ పర్వతమున 

పరమ శివునిని మెప్పించ వ్రతము బూని

యన్న పానీయముల మాని యలసి పోక

తపము సల్పెనా శంభుని దరికి చేర./

3.

మంగళంబుల

గురిపించు మహిత శక్తి

జగతి నేలెడి జనయిత్రి 'ఛన్నఘంట'

శివుని యర్థాంగి పార్వతి క్షిప్ర సాధ్య 

మూల ప్రకృతి శ్రీమాత ముక్తి దాయి /

4.

దిశలు వెల్గించు 

'కూష్మాండ దేవి' దయను

కోరి కొల్చిన భక్తుల కొంగు పసిడి

జగములన్ సృజి యించిన శక్తి పూర్ణ 

సర్వ సిద్దుల నిచ్చు విశ్వాత్మ ధారి /

5.

'స్కందమాత'ను పూజింప శాంతి కలుగు

చంటి బిడ్డల గాపాడి సత్త్వ మొసగి

జీవ రక్షణ చేయుచు చింత దీర్చు

తల్లి నెప్పుడు మదిలోన దల్చ వలయు /

6.

మహిని 'కాత్యాయనీదేవి' మహిమ లెల్ల

నెఱుగ జాలడు సురలోక యింద్రు డైన

చంద్ర హాసము ధరియించి జగతి నేలు

జననినిన్ గాంచ కల్గును జయము మనకు/

7.

ఖరముపై చరి యించెడి 'కాళరాత్రి'

దేవి దుష్టుల దునుమాడి దీర్చు భయము

పదము లంటిన చాలును భక్తి తోడ 

విద్య జ్ఞానంబులనొసగు విమల చరిత/

8.

శ్వేతవృషభ వాహిని నిల్చి శివుని చెంత

శుభము లిచ్చు 'మహాగౌరి' శుద్ధ మైన

మనసు గలభక్తులన్ గాచి మహిని వెల్గు 

కాంతి రూపిణి యా దేవి కన్నులందు

కరుణ వర్షపు ధారలు కురియు చుండు./

9.

సిద్ధ గంధర్వ సేవిత సిద్ధి ధాత్రి

కోర్కె లన్నియు తీర్చుచు కూర్మి చూపి

దీవెనల్ కురిపించెడి దేవి నెపుడు

భక్తి మీరగ కొల్చిన శక్తి కలుగు./


10.(తేటగీతి మాలిక )


 

పరమ పావని పరిశుద్ధ భావ జలధి

భక్తులెల్లరన్ బ్రోవుచు వరము లీయ

వెలసె నీయింద్ర గిరిపైన పెన్నిధి వలె.

సింహ వాహిని దుర్గమ్మ జీవకోటి

రక్షణంబును వహియించి లలిని చూపు.

నెల్ల వేళల కాపాడు తల్లి మహిమ

పొగడ తరమౌన మన బోంట్ల మూఢతతికి.

తల్లి నామము నిరతంబు తల్చు కొనుచు

వెళ్లదీయుచు ప్రాణంబు వీడు వరకు

నడిచి పోవుదు తల్లినే నమ్ము కొనుచు./

----------------------------


Rate this content
Log in

Similar telugu poem from Classics