STORYMIRROR

# Suryakiran #

Romance

4  

# Suryakiran #

Romance

నువ్వు , నేను , ఆకాశం !

నువ్వు , నేను , ఆకాశం !

1 min
438


సూర్యోదయానికి ముందు

ఆకాశంలో ఎంత ప్రశాంతత .

చల్లగా ఉండే ఆ వేళ

నీలిరంగుకు ఆభరణంలా

ఎంత సుందరత !

పసిడిఛాయతో మరో రోజుకై ,

అలుపెరుగని పయనానికి సిద్ధమై ,

సకల జీవరాశికి శక్తి ప్రదాతై ,

సమయపాలనలో సాటిలేని మేటియై ,

సూర్యభగవానుడు అందరికి ప్రేరణై !

ప్రియా ! నీకోసమే నేను ;

నీ సౌందర్యానికి ముగ్ధుడను .

నేనొక సామాన్యుడను ;

ఆశతో జీవించే ప్రేమికుడను !

ఈ అంతులేని ఆకాశమే హద్దుగా ,

పచ్చగా అలరారే భూమి ఆధారముగా ,

స్వచ్ఛమైన నీరు మన ప్రేమకు రూపముగా ,

చుట్టూ ఉండే గాలి నిరంతరం ఊపిరిగా ,

సూర్యుని తేజస్సు అగ్నిలా , వెచ్చగా !

మన ప్రేమ కలకాలం

ఈ అందమైన ప్రకృతి సాక్షిగా !!

*** # *** # ***




Rate this content
Log in

Similar telugu poem from Romance